*పట్టణాన్ని స్వచ్చదనంగా – పచ్చదనంగా మార్చాల్సిన బాధ్యత మన అందరిదీ..MLA , తిరు నగర్ భార్గవ్
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *స్వచ్చధనం- పచ్చదనం* 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్చ పట్టణంగా పచ్చధనంతో తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఈ ఐదు రోజుల కార్యక్రమం మంచి అవకాశం కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు.. *స్వచ్చధనం – పచ్చధనంలో* మిర్యాలగూడ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రం లో మొదటి స్థానంలో ఉండేలా ప్రతిఒక్కరం కృషి చేయాలని అన్నారు.. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటింంటి ఒక చెట్టు నాటాలని కోరారు దానివల్ల పర్యావరణ భారీ నుంచి బయటపడతామని అన్నారు ప్రజలు మున్సిపల్ అధికారులకు సిబ్బందికి సహకరించాలని ఇది వర్షాకాలం సీజన్లో చెట్లు నటడం వల్ల అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట మొక్కలు నాటడం జరిగింది .. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్ యూసుఫ్, కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు ,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.