అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి
వేములపల్లి( ప్రజాలహరి) మనము మన చుట్టూ ఉండే ప్రాంతం పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనము బాగుంటాం, అప్పుడే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని, జిల్లా పంచాయతీ అధికారి వి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ స్వచ్ఛ తెలంగాణ అనే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి పౌరుడు తమ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఆ గ్రామములో ప్రజలు ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బంది బట్టి పర్పస్ వర్కర్లు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ గ్రామాల్లో పారిశుద్ధ పనులు సక్రమంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రవణ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్, ఇతర సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు నాగవల్లి మధు, రావు ఎల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి కాంతారెడ్డి, అమ్మిరెడ్డి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు