*రైతాంగ పోరాట స్ఫూర్తి తో ప్రజా పోరాటాలకు సిద్ధం కండి*
మిర్యాలగూడ ప్రజాలహరి
*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ గట్టికొప్పుల రాంరెడ్డి గారి 5 వ వర్ధంతి సందర్బంగా కార్యకర్తలకు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపు*
తెలంగాణ ప్రాంతానికే కాకుండా దేశం లో అనేక పోరాటాలకు దీక్ష్చుచిగా, ఆదర్శంగా నిలిచినా తెలంగాణ రైతాంగా పోరాట స్ఫూర్తి తో అమరవీరులు చూపిన విప్లవకర మార్గం లో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని, ఈ పోరాటాలకు ప్రజా సమస్యల అధ్యయనం చేసి ముందుకు వెళ్లాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టు పార్టీ లకు ఎదురుదెబ్బలు, ఆటంకాలు కొత్తకావని ఇలాంటి అనేక సందర్బలను ఆదిగమించి మళ్ళీ విజయం సాధించి ప్రజల కోసం నిలబడ్డ చరిత్ర ఎర్రజెండా కు ఉందని వారు తెలిపారు
ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అధికారం వచ్చిన తరువాత వాటిని అమలు చేయని ఈ ప్రభుత్వలపై భవిష్యత్తు లో పెద్ద ఎత్తున పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
కామ్రేడ్ గట్టికొప్పుల రాంరెడ్డి గారు మిర్యాలగూడ తాలూకాలో పేద కూలీల పక్షాన పోరాడి వారి హక్కుల సాధన కోసం భూస్వాములతో రణం చేసి ఈ ప్రాంతం లో కమ్మ్యూనిస్టు ఉద్యమాన్ని నిలబెట్టారని వారు గుర్తుచేశారు.
పూటకో పార్టీ గంటకో రంగు మార్చే నేటి దివాలకోరు రాజకీయాలను వారి స్పూర్తితో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతమరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, రెమడాల పరుశురాం,మాజీ సర్పంచ్ సైదమ్మ, శాఖ కార్యదర్శి జిల్లా నగేష్, కార్యదర్శులు కుమ్మరి సైదులు, గుంటి శ్రీను, పుల్లయ్య, జిల్లోజు శ్రీను, ఉన్నం వెంకటేశ్వర్లు,చౌగాని వెంకన్న, ఆశీర్వాదం, మరియు గట్టికొప్పుల రాంరెడ్డి గారి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు*