సంక్షేమానికి నాంది పలికిన మహానేత ఎన్టీఆర్
* ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన నల్లమోతు భాస్కర్ రావు…
మిర్యాలగూడ ప్రజాలహరి
ప్రజా సంక్షేమానికి నాంది పలికిన దివంగత మహానేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)అని మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగో సారి గెలిచి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు తొలిసారిగా హైదారాబాద్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ఆయన నివాసం వద్ద నల్లమోతు భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు.
మహానేత ఎన్టీఆర్ అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఆయన బాటలోనే ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందించగలరని నల్లమోతు భాస్కర్ రావు ఆకాంక్షించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఐకమత్యంతో విభజన సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధిపథంలో ముందుకెళ్ళాలని కోరారు. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకుందామని భాస్కర్ రావు తెలిపారు…