రైతు రుణమాఫీ ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం…………..
మిర్యాలగూడ ప్రజాలహరి…. రైతు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి చిత్రపటానికి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ 31 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించడం అర్శించదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా మాట తప్పకుండా అమలు చేస్తా ఉంది రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వానికి రైతు శ్రేయస్సు కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో రైతులందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు , మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సలీం ఎన్ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ ,మండల పార్టీ అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్, సీనియర్ నాయకులు ఆవుల బక్క రెడ్డి , పోలగానే వెంకటేష్ గౌడ్, జేట్టి వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ , ఐఎన్టీయూసీ అధ్యక్షులు చాంద్ పాషా, పోలిశెట్టి అజయ్ , పానుగోతు మల్సూర్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు*