నంది పహాడ్ లో రహదారులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరిన…. పగడాల నాగిరెడ్డి బృందం… ప్రజాలహరి మిర్యాలగూడ..
తెలంగాణ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని శుక్రవారం నంది పహాడ్ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు పగడాల నాగిరెడ్డి, నంది పహాడ్ యూత్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు సలికంటి వినోద్,కౌన్సిలర్ రామకృష్ణ తదితరులు కలిశారు . ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చములు ఇచ్చి అభినందనలు తెలిపారు. అదేవిధంగా నంది పహాడ్, రవీంద్ర నగర్ పలు ప్రాంతాల్లో సుమారు ఐదున్నర కిలోమీటర్ల మేర రహదారులు కోసం సిసి రోడ్డు & డ్రైనేజీ నిర్మాణానికి నిధులు విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కి కూడా తెలియజేశామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.