ప్రజాలహరి , మిర్యాలగూడ క్రైమ్ …
భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామంలో కొలువై ఉన్నటువంటి సహస్ర శివలింగాల సన్నిధానం రమణేశ్వరం భూ కైలాసంగా విరసిల్లుతున్నది. అనేక ఋషినామాల పేర్లతో స్థాపించబడి మరియు మహా ఋషుల నామాల పేర్లపై శివలింగ ప్రతిష్టలు రమణానంద మహర్షి వారిచే చేయబడి దిన దిన ప్రార్ధమానమై వెలుగొందుచున్నది .ముఖ్యంగా రమనేశ్వరము యొక్క గర్భ గుడి లాగా విలసిల్లుచున్నటువంటి బంగారు శివలింగ దర్శనం వేనోళ్ల కొనియాడ బడుచున్నది. జన్మజన్మల పాపములు నశించి ఇష్ట కామ్యములను నెరవేర్చే శివలింగం మూడు అడుగుల బంగారు శివలింగం భక్తుల కొంగుబంగారమై నిత్య పూజలు అందుకుంటున్నారు ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్టాపనమే కాకుండా సాలగ్రామ శివలింగ ప్రతిష్ట లు మనము ఇక్కడ దర్శించుకోవచ్చు .పలువురు ఇక్కడ ప్రతిష్టలను కొనియాడటమే గాక నిత్యాన్న దానమును పురస్కరించుకొని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రతిష్టలను అనుకోవడమే గాక భూకైలాసంగా విరాజిల్లుతున్నదని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో నామమాత్రపు పారిశుద్ధ్యపు రుసుము కింద తలసరి 100 రూపాయలను టోకెన్ రూపంలో వసూలు చేస్తున్న భక్తులు సదా మహాదానంగా సందర్శకులు ప్రతినిత్యం పెరుగుతున్నారు. రమేశ్వరానికి తెలంగాణ, ఆంధ్ర మరియు ఇతర రాష్ట్రాలు వివిధ ప్రాంతాల నుండి చేరుకోవాల్సిన భక్తులు భువనగిరి మీదుగా యాదగిరిగుట్ట వెళ్లాల్సిన బస్సు ద్వారా నాగిరెడ్డిపల్లి స్టేజి వద్ద దిగాలి ఇంతే కాకుండా రైల్వే స్టాఫ్ కూడా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు