- పశ్చిమబెంగాల్లో ఘోర రైలు ప్రమాదం ఐదుగురు మృతి 20 మంది గాయాలు…
ప్రజాలహరి , జనరల్ డెస్క్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ శివారు జల్పై గుడి సమీపంలో కాంచన జంగ్ ఎక్స్ప్రెస్ రైలు అస్సాం నుంచి ఇనుముతో వస్తున్న గూడ్స్ రైలు ఎదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రైలు భోగి ఎగిరిపడ్డాయి. ఇందులో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికి 25 మంది గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలిస్తున్నారు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సహాయక కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రధాని మోడీ, రైల్వే మంత్రి సంతాపం వ్యక్తం చేశారు సహాయం చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలను మరియు గాయపడ్డ కుటుంబాల ఆదుకోవాలని సూచించారు