*బొలోరో వాహనం డీ మహిళ మృతి చిన్నారికి గాయాలు*
ప్రజాలహరివేములపల్లి:, మిర్యాలగూడ ప్రజాలహరి క్రైమ్* బొలోరో వాహనం ఢీకొని ఓ మహిళ మృతి, చిన్నారికి గాయాలు అయినా ఘటన వేములపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.. ఎస్ఐ డి విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారంగా… నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ఎన్.ఎస్.పి క్యాంపులో నివాసముంటున్న మల్లికంటి కలమ్మ(40) అలియాస్ కళావతి భర్త సంపత్ అనే మహిళ, తన కుమార్తె కూతురు ఐషు(మనవరాలు)ను ఎత్తుకొని వేములపల్లి కేంద్రంలో ఓ పని నిమిత్తం ఉదయం సుమారుగా 10:30 గంటలకు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వద్ద నుండి అద్దంకి-నార్కట్పల్లి రోడ్డు వెంబడి మట్టి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా, బల్లికురవ మండలం, కూకట్లపల్లి గ్రామానికి చెందిన తాళ్ల అంజిరెడ్డి తండ్రి బ్రహ్మారెడ్డి అను వ్యక్తి (టీఎస్ 05 యూఎఫ్ 6282) నెంబర్ గల బొలోరో వాహనంతో అతివేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొనడంతో కలమ్మ తలకు, కాళ్లకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అవ్వగా, తన మనవరాలు ఐషు తలకి, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడే ఉన్న మల్లికట్టి మహేష్ కుమార్, నార్ల కంటి సుధాకర్లు తన భర్త అయినా మల్లికంటి సంపత్ కు సమాచారం ఇచ్చారని, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న సంపత్ రక్త గాయాలతో పడి ఉన్న తన భార్య కలమ్మ ను, తన మనవరాలు ఐషు లను 108 అంబులెన్స్ లో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో సుమారుగా 11 గంటల 30 నిమిషాలకు తన భార్య కలమ్మ అలియాస్ కళావతి చనిపోయినట్లు వైద్యులు తెలిపారని, మనవరాలు ఐషు ను మెరుగైన వైద్యం నిమిత్తం మిర్యాలగూడలోని స్టార్ హాస్పిటల్ కి తరలించినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.