
*గ్రామీణ స్థాయి నుంచే వినియోగదారుల సంఘాల బలోపేతానికి కృషి: CATCO*
*నాగార్జునసాగర్ లో నేడు జరిగిన CATCO రాష్ట్ర కార్యవర్గ సమావేశం*
మిర్యాలగూడ ప్రజాలహరి
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచే వినియోగదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలని, ఆగస్టు నెలలో రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించాలని తెలంగాణ వినియోగదారుల సంఘాల సమాఖ్య (CATCO) రాష్ట్ర కార్యవర్గం సమావేశం తీర్మానించింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీ యూత్ హాస్టల్ లో క్యాట్కో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి క్యాట్కో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వేముల గౌరీ శంకర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు శంకర్ లాల్ చౌరాస్యా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా రైతు వినియోగదారుల సంఘాలు, పాఠశాలలు కళాశాలల్లో వినియోగదారుల క్లబ్ లు మహిళా వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయుటకు రాష్ట్ర కార్యవర్గ బాధ్యులు చొరవ తీసుకోవాలని, గ్రామీణ స్థాయి నుంచే వినియోగదారుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో వినియోగదారుల సంఘాల ఉండేవిధంగా బాధ్యతగా పని చేయాలని, తద్వారా ఆయా వినియోగదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని నాగార్జునసాగర్ లో ఈ ఏడాది ఆగష్టు నెల 10,11 తేదీలలో రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించాలని క్యాట్కో రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సదస్సుకు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు హాజరవుతారని, సదస్సు నిర్వహణకు సంబంధించి క్యాట్కో రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శులకు బాధ్యతలను అప్పగించారు. సదస్సు విజయవంతం అయ్యేందుకు ప్రత్యేకించి వివిధ కమిటీలను ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో జరుపతలపెట్టిన వినియోగదారుల సదస్సు విజయవంతం చేయాలని వినియోగదారుల సంఘాల ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో క్యాట్కో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. సంపత్ కుమార్, రాష్ట్ర నాయకులు అన్నెబోయిన మట్టయ్య, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, ఎస్. రమేష్ బాబు, సిహెచ్. గురవయ్య, పి. సోమయ్య, షేక్ సైదా, కడారి వెంకటేష్, ఎండి. ముస్తఫా, ఎండి. నజీర్ పాష, కట్ట మనోహర్ తదితరులు పాల్గొన్నారు.