ఆస్తికోసం అన్న తమ్మునిపై దౌర్జన్యం
వేములపల్లి( ప్రజాలహరి) వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో సంబంధించిన ముండ్ల గురువయ్య అనే వ్యక్తి, అతని తమ్ముడు గంగయ్య పై వివిధ రకాల దాడులు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు, ఆయన విలేకరుల ముందు వాపోయారు. పూర్తి వివరాలు కి వెళ్తే మండలంలోని ఆవులు గ్రామానికి చెందిన ముండ్ల గురువయ్య, గంగయ్య అనువారు ఇరువురు అన్నదమ్ములు, ఇరువురి అన్నదమ్ములకు గాను తల్లిదండ్రులు సుమారుగా 26 ఎకరాల ఆస్తిని పంచి ఇవ్వడం జరిగింది. గంగయ్య అనే వ్యక్తి చిన్నవాడు కావున గురువయ్య అనే అతను తల్లిదండ్రు పంచ్ ఇచ్చిన ఆస్తిని తన తమ్మునికి తెలవకుండా సుమారుగా ఒక రెండు ఎకరాలు అక్రమంగా పట్టేసుకున్నట్టు గంగయ్య పేర్కొన్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రు ఇచ్చినటువంటి ఇంటి స్థలమును అక్రమంగా గురువయ్య ఆక్రమించుకొని మీకు ఇంట్లో భాగం లేదని తోడబుట్టిన తోడని చూడకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు దీంతో ఊరుకోకుండా వేరే వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండడంతో, అటు ఇల్లును సైతం ఖాళీ చేయించి బాగా వేధిస్తున్నాడని మనోవేదన వ్యక్తం చేశాడు. గురువయ్య అనే వ్యక్తి ఎక్కడ దిక్కు లేక తన సొంత పొలంలో ఒక గుడిసె నిర్మాణం చేసుకుంటే అట్టి గుడిసెలో నుంచి వెళ్లిపోవాలని గుర్తుతెలియని వ్యక్తులతో చిత్రం గురి చేస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని ఆయన తీవ్ర అసంతృప్తికి లోనవుతు, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇట్టి విషయంపై జిల్లా పోలీస్ అధికారులు చొరవ తీసుకొని నాకు ప్రాణ రక్షణ కల్పించాలని ఆయన అధికారులను కోరారు