మిర్యాలగూడ ప్రజాలహరి….ప్రపంచంలోని బౌద్ధ బిక్షులను ఆకర్షించేలా నాగార్జునసాగర్ బౌద్ధమనాన్ని తీర్చిదిద్దామని తెలంగాణ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు .ఆయన శనివారం నాగార్జునసాగర్ బౌద్ధ వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిక్షువులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వనాన్ని ప్రశాంతంగా ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని టూరిజం అధికారులకు తెలియజేశారు. బౌద్ధవనాన్ని పరిశీలించి బుద్ధుడు యొక్క పాదాలకు నమస్కరించారు.
ఆయన వెంట నలగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు కుందూరు జై వీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బుధవారం ఇంచార్జ్ జీతన్ , నందికొండ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, పిసిసి సభ్యుడు కర్నాటి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు