
ప్రజాలహరి న్యూ ఢిల్లీ… భారత ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారం చేపడుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఆయన పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ప్రెస్మీట్లో మాట్లాడుతున్నారు దేశం కోసం ప్రజల కోసము పని చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రజలు అద్భుతనం విజయాన్ని అందించారని పేర్కొన్నారు అక్కడ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు అనే విషయాన్ని గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమని ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని కోరారు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకోకపోయిందని పేర్కొన్నారు. ఎన్నికలు ఇంత ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్కు తమ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేరళలో తొలి విజయాన్ని సాధించిన బిజెపి భవిష్యత్ కాలంలో ప్రపంచానికి ఆదర్శప్రాయంగా పరిపాలన చేయాలనేది చూపిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంచిగా గెలుపొందారని, తెలంగాణలో కూడా 8 పార్లమెంటు సీట్లు సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నా రు.