
రెండు నుంచి 400 సీట్లకు అడుగులు..
నరేంద్ర మోడీ సంచలన ప్రభంజనం…
ప్రజాలహరి జనరల్ డెస్క్… 1985లో రెండు సీట్లతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు 400 పార్లమెంటు సీట్ల మార్కుకు చేరువులోకి వచ్చింది .ఈ క్రెడిట్ అంతా నరేంద్ర మోడీ కే చెందుతుంది.. ఫుల్ టైం కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అడుగులు వేసుకుంటూ ముఖ్యమంత్రిగా రికార్డులు బ్రేకు చేసుకుంటూ అక్కడి నుంచి ప్రధాన మంత్రి పీఠం ఆదిష్టించారు .ఇక అక్కడి నుంచి వెనుకకు తిరిగి చూడలేదు. ఆయనే నరేంద్ర మోడీ. ప్రతి అడుగు, ప్రతి పని సంచలనం భారతదేశపు ఖ్యాతి, అభివృద్ధి లక్ష్యంగా ఉంటుంది .ఆయన చేసిన అయోధ్య రామ మందిరం, త్రిబుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు ,జమ్మూ,కాశ్మీర్ ,లడక్ రాష్ట్రాల ఏర్పాటు కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం ఇటువంటి విజయ సంకల్ప ప్రకటనలు భారతీయ జనతా పార్టీని ఆసేతు హిమాచల పర్యంతం తీసుకువెళ్లింది. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ పెద్దన్న పాత్ర పోషిస్తూ భవిష్యత్ కాలానికి ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తున్నారు. నిర్ణయాలు సహాయక చర్యలు తీసుకు వెళుతున్నారు అది ఒక నరేంద్ర మోడీ , భారతీయ జనతా పార్టీ వలనే సాధ్యమైంది. భారతదేశాన్ని నాశనం చేయాలని చూసిన దేశాలు ఈరోజు భారత్ సహాయం లేనిదే మేము ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేని అనే పరిస్థితికి వచ్చిందంటే ఆ ఘనత నరేంద్ర మోడీ . భారత్ భవిష్యత్తు దూరదృష్టి ఆలోచనలే సత్ఫలితాలు భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుంచి జాతీయస్థాయిలో బలపడటానికి కారణమైంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని దేశవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేసి సఫలీకృతులయ్యారు. ఆయన అనుకున్న టార్గెట్ ని దాదాపు రీచ్ అయ్యారు. ఫలితాలే తరువాయి . నరేంద్ర మోడీ గొప్పతనం నేటి 18 ఏళ్లు నిండిన యువతరం మోడీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నారు. గ్రామాల్లో వృద్ధులు, మహిళలు, మధ్య వయస్కులు సైతం కూడా భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేస్తున్నారనీ చెప్పడంలో అతిశయోక్తి లేదు.