దామరచర్ల ప్రజాలహరి…. యాదాద్రి పవర్ ప్లాంట్ పై విచారణ వేగవంతం అయింది. విచారణ నిమిత్తం కమిషన్ సభ్యులు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి శనివారం యాదాద్రి పవర్ ప్లాంట్ లో పర్యటించారు .ఈ సందర్భంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ను బీహెచ్ఈఎల్ కు అనధికారికంగా కట్టబెట్టారని వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు .ఇప్పటికి పలు కంప్లైంట్ వచ్చాయని వాటి మీద అందరికీ నోటీసులు ఇచ్చామని నోటీసులు నుంచి ఇంతవరకు స్పందన రాలేదని అన్నారు. ఆగస్టు లో ఒక యూనిట్ రన్నింగ్ లోకి వస్తదని మరో యూనిట్ సెప్టెంబర్ లో రన్నింగ్ లోకి వస్తదని ఈ సందర్భంగా వివరించారు. తద్వారా రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉండదని పేర్కొన్నారు ఈ సమావేశంలో యాదాద్రి పవర్ ప్లాంట్ యస్సి సమ్మయ్య ,ఏఈ వేణుధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.