ఘనంగా తెలంగాణ అవతరణ శతాబ్ది వేడుకలు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
. ప్రజాలహరి హైదరాబాద్.,
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శతాబ్ది ఉత్సవాలు లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నార ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను కొనియాడారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగిన అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు శతాబ్దాలు కలను నిజం చేసిన సోనియాగాంధీకి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో 100 సంవత్సరాలువిధ్వంసం సృష్టించారని పిడికెడు గుప్పిట్లోనే తెలంగాణ పాలన కొనసాగిందని సంస్కృతి సాంప్రదాయాలు ధ్వంసం అయినవని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజల కోసం ఎన్నికైన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదని తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి సోనియా గాంధీ ఒక ప్రకటనద్వారా ప్రకటించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంక్షేమ ముసుగు లో చెరపట్టాలని చూస్తే తెలంగాణ సహించదని మా పాలనలో తెలంగాణకు స్వేచ్ఛను పూర్తిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు కూడా గౌరవిస్తున్నామని చెప్పారు. తమ సర్వజ్ఞానులమని అనుకోలేదని అందరూ సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సుష్మా స్వరాజ్ సేవలు మర్చిపోమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమకారులు, సాహితి వే తలు, కవులు, కళాకారులు, రచయితలు ,మేధావులు వారి పోరాటాల ఫలితమే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి, డిజిపి రవి గుప్తా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కృష్ణారావు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులు పాల్గొన్నారు