తీన్మార్ మల్లన్న ను గెలిపించాలి
*సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యులు డబ్బికార్
మిర్యాలగూడ ప్రజాలహరి
మిత్రపక్షాల అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి లో భాగంగా బిజెపి ని ఓడించేoదుకు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుకగా తీన్మార్ మల్లన్న నిలుస్తారని చెప్పారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో పోరాడి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి కృషి చేస్తారని చెప్పారు. అన్యాయాన్ని సూటిగా ప్రశ్నించేటప్పుడు తీన్మార్ మల్లన్న కు ఉందని చెప్పారు. పట్ట భద్రులు మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్నకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, డా. మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు,ఆయూబ్, గుంటోజు వీరాచారి, రామారావు, వెంకట్ రెడ్డి, బాషా తదితరులు పాల్గొన్నారు.