*కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం- భాస్కర్ రావు*
మిర్యాలగూడ ,ప్రజాలహరి
*మిర్యాలగూడ మండలం జాలుబాయి తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జర్పుల లింగు విద్యుదాఘాతంతో మరణించారు, లింగు బీఆర్ఎస్ పార్టీ సబ్యత్వం కలిగి ఉండడం వల్ల వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కు మంజూరు అయ్యింది, అట్టి చెక్కును ఈరోజు రెడ్డికాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గర్లతో కలిసి మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు లింగు కుటుంబీకులకు అందజేశారు*..
*కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా మాజీ అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిట్టిబాబు నాయక్, అన్నాభీమోజు నాగార్జున చారీ, పాక్స్ ఛైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ, జర్పుల సేవ నాయక్, సైదా నాయక్, పల్లపు రామస్వామి, గుండెబోయిన చందుయాదవ్, కుంచం రాజ్ కుమార్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు*.