మిర్యాలగూడ, దామరచర్ల ,ప్రజాలహరి.
: 22న మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో దామరచెర్ల గ్రామంలో నివాసముంటున్న ఇండ్ల నాగరాజు S/o మల్లయ్య, యొక్క పెద్దకుమారుడైన నాగ ధనుష్, వయస్సు; 11 సం”రాలు మరియు తన మరదలి కుమారుడైన పెద్దిశెట్టి సాత్విక్ S/o నరేంద్ర, వయస్సు; 08 సం”రాలు, మరికొంతమంది పిల్లలతో కలిసి దామరచెర్ల గ్రామ శివారులోని నాగుల్ చెరువు వద్దకు ఈతకు వెళ్ళినారు. అయితే నీటిలో దిగిన సమయంలో వారికి ఈత రాకపోవడంతో ఆ ఇద్దరూ నీటిలో మునిగిపోయినారు. వెంటనే అక్కడున్నవారు ఇద్దరినీ కాపాడే ప్రయత్నం చేసినారు, కానీ ఆ ఇద్దరిని బయటికి తీయగా అప్పటికే ధనుష్ నీట మునిగి అక్కడికక్కడే చనిపోయినాడు. కొన ఊపిరితో ఉన్న సాత్విక్ ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని బాలాజీ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించుచుండగా సాత్విక్ కూడా చనిపోయినాడు. తదుపరి వాడపల్లి ఎస్ఐ E.రవి ఇండ్ల నాగరాజు యొక్క ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేయనైనది.