Ultimate magazine theme for WordPress.

డాక్టర్ మున్నీర్ కు అంతర్జాతీయ సేవ అవార్డు

Post top
home side top

తెలంగాణ వాసికి అంతర్జాతీయ పురస్కారం

* మరో ప్రతిష్టాత్మక వర్శిటీ నుంచి డాక్టరేట్ కు ఎంపికైన డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్

* ఈనెల 25న హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ప్రదానం చేయనున్న నిర్వాహకులు

* హర్షం వ్యక్తం చేసిన జనయేత్రి ఫౌండేషన్ సభ్యులు

మిర్యాలగూడ ప్రజాలహరి.

 

#తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వినూత్న ఆలోచనలు, ప్రతిభ, సృజనాత్మక విభాగంలో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్టు అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్శిటీ నిర్వాహకులు డాక్టర్ పవన్ కుమార్ భూట్, డాక్టర్ వెంకట కే. గంజాం ప్రకటించారు. ఈనెల 25న హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్టు ఈమేరకు వారు ఆహ్వాన పత్రం ద్వారా వెల్లడించారు. అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్శిటీ తమ అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ కు డాక్టరేట్ ప్రదానం చేయడం పట్ల జనయేత్రీ ఫౌండేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

 

 

#సేవల ద్వారా గుర్తింపు పొందిన డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్….

 

నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణంలో ప్రజా వైద్యుడిగా, పేదల డాక్టర్ గా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ విశేష గుర్తింపు పొందారు. జనయేత్రి ఫౌండేషన్ ను స్థాపించి పొరుగు రాష్ట్రాల్లోనూ తన సేవలను విస్తరించిన అనతి కాలంలోనే ఆయన ఈ పురస్కారానికి ఎంపిక కావడం గమనార్హం. మానవ హక్కుల సాధనలో అవిరామంగా కృషి చేయడంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థ సేవలను నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు వైద్య వృత్తిలో తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన సమయంలో సింహభాగం సామాజిక సేవా కార్యక్రమాల కోసం సద్వినియోగం చేస్తున్న డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ వంటి సోషల్ వర్కర్స్ సమాజానికి అవసరం. ఎంతో నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన సేవలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజాసేవే తన అభిమతంగా భావించి ఎందరో నిరుపేదలకు తన శక్తివంచన మేరకు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ సేవలందించారు. ఆపదలో ఉన్న రోగులకు రక్తదానం చేయడం కోసం రక్తదాతల ప్రత్యేక వాట్సాప్ గ్రూపు నిర్వహించడం ఆయన సామాజిక సేవా సుగుణానికి అద్దం పడుతున్నాయి. అన్ని కాలాల్లో ఆయన సేవలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయంటే ఆయనకు అల్లా దీవెనలు మెండుగా ఉన్నాయి. మండుటెండల్లో బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, ఎముకలు కొరికే చలిలో నిర్భాగ్యులకు దుప్పట్లు పంపిణీ, వానాకాలంలో కడు పేదలకు, యాచకులకు ఆహారం పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ అందరి హృదయాల్లో నిలిచిపోతాయి.

 

#డాక్టరేట్ కు ఎంపికవడం అదృష్టంగా భావిస్తున్నా…

 

తన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం నుంచి

డాక్టరేట్ కు ఎంపిక చేసిన అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్శిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ అవార్డు స్వీకరణ అనంతరం తన బాధ్యత మరింత పెరుగనుందని తాను భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిండు నూతనోత్సాహంతో ఇంకా బాగా కష్టపడి సమాజ అభ్యున్నతి కోసం పాటుపడతానని అన్నారు. తన అమ్ముల పొదిలో మరో అవార్డు వచ్చి చేరిందని, ప్రతిష్టాత్మక డాక్టరేట్ పురస్కారం తనను వరించడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉన్నదని డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు

post bottom

Leave A Reply

Your email address will not be published.