#దేశంలోనే అజేయశక్తి ‘బీఆర్ఎస్’
* పార్టీలో సభ్యత్వమున్న ప్రతీ కార్యకర్తకు ప్రమాద బీమా
* బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కవచంగా ప్రమాదబీమా
* 100 కోట్ల రూపాయలకు పైగా బీమా చెల్లింపు
* రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన గద్ద వెంకన్న కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత : నల్లమోతు సిద్ధార్థ .
మిర్యాలగూడ ప్రజాలహరి
బీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అజేయశక్తిగా అవతరిస్తోందని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ తెలిపారు.
ప్రమాద బీమా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కవచంగా పనిచేస్తోందని అన్నారు. ఉద్యమ కాలం నుంచి జెండా పట్టి సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తూ మృతిచెందిన ప్రతీ కార్యకర్తకు రూ.2 లక్షల ప్రమాద బీమా అందజేస్తున్నామని అన్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని క్లిష్ట సమయాల్లోనూ కార్యకర్తలను ఆదుకునే స్థాయికి బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గద్ద వెంకన్న
రూ.100 చెల్లించి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఈ నేపథ్యంలో గద్ద వెంకన్న కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆదుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అందిన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఆయన నామినీకి మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీలోని
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నల్లమోతు సిద్దార్థ
అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తమ పార్టీ కార్యకర్తలకు ఆపన్న హస్తం అందిస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు కేటీఆర్ రూ.100 కోట్లకు పైగా ప్రీమియం మొత్తాన్ని బీమా కంపెనీలకు చెల్లించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా నిలుస్తామని నల్లమోతు సిద్దార్థ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగార్జున చారి, యెడవల్లి శ్రీనివాస్ రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, రఘుమా రెడ్డి, షోయబ్,నాగుల్ బాబా, చోటు, గుండెబోయిన చందుయాదవ్, దోనేటి సైదులు, నల్లగంతుల నాగభూషణం,తదితరులు పాల్గొన్నారు.