
మిర్యాలగూడ ప్రజాలహరి..
మిర్యాలగూడ గ్రంధాలయం లో పట్టభద్రుల తో ప్రత్యేక సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలసి పాల్గొన్న ప్రముఖ విద్యావేత్త , స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ – వికలాంగుల సంక్షేమశాఖ ముత్తీనేని వీరయ్య పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బిజెపి, బి ఆర్ ఎస్ లు పట్ట భద్రుల ద్రోహులు అన్నారు
పట్టభద్రుల ఆత్మబంధువు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నీ అత్యదిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు గత 20 ఏండ్లు లో 28 వేల మంది కి పైగా పట్టభద్రుల కీ కాంపిటిటేటివ్ విద్యను అందించానని, వారందరూ తీన్మార్ మల్లన్న కి మద్దతు తెలపాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అన్నారు
ఈ దేశంలో కోట్ల మంది కి ఉద్యోగ కల్పన చేసిందీ కాంగ్రెస్ అని అన్నారు
ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్త అని మోసం చేసింది, బీజేపీ నీ చిత్తు చిత్తు గా ఓడించాల్సిన అవసరం ఉంది అన్నారు
BRS 10 ఏండ్లు లో ఉద్యోగాలను మార్కేట్ లో కూరగాయలు మాదిరి అమ్మింది అన్నారు .
BRS కి పట్టభద్రుల ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు.
కావున మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.