
ప్రజాలహరి మిర్యాలగూడ..
మిర్యాలగూడ పట్టణంలోని గ్రంధాలయం నందు విద్యార్థులు మంచి నీటి సమస్యతో బాధపడుతున్నారు అని విషయం తెలుసుకొని *BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రిజ్ ని ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మంచినీటి సమస్య వలన వారి చదువులకు అంతరాయం కలుగకూడదు అనే ఉద్దేశంతో ఫ్రిజ్ ఏర్పాటు చేయడం జరిగింది.. అలాగే విద్యార్థులతో మాట్లాడి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా నాకు తెలియజేయండి అని అన్నారు.. రేపటి మన మిర్యాలగూడ భవిషత్తు మీరంతా అందుకే ప్రతిఒక్కరూ కృషి పట్టుదలతో చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు.. మీతో పాటు మేము మా *BLR బ్రదర్స్* అందరూ ఎల్లపుడూ మీకు అందుబాటులో ఉంటామని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.