
10,000/- వేల రూపాయలు గాలి వానతో రేకులు కూలిన ఇంటికి అండగా ఆర్ధిక సహాయం అందించిన సిద్దు యువసేన
మిర్యాలగూడ ,దామరచర్ల ,ప్రజాలహరి
దామరచర్ల మండలం పెద్దతండ కు చెందిన ధనావత్ ధర్మ నాయక్ గారి ఇల్లు పై కప్పు రేకులు నిన్న వచ్చిన వర్షానికి కులిపోయి గాల్లో ఎగిరి పోవడమే కాక లోపల కుటుంబ సభ్యుల మీద పడి చిన్న గాయాలు కావడం ,సామన్లు కొన్ని ధ్వంసం అవడం జరిగింది. కుటుంబ సభ్యులను స్థానిక MLA బత్తుల లక్ష్మారెడ్డి ఫోన్లో పరామర్శించి MRO దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం పరంగా సహాయం అందేటట్లు చర్యలు చెప్పటేటట్టు అదేశాలను జారీ చేశారు. ఈ ఆర్ధిక సహాయాన్ని దామరచర్ల మండల సీనియర్ నాయకులు సిద్దు నాయక్ ధనావత్ భీకు నాయక్ చేతుల మీదుగా అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.