Ultimate magazine theme for WordPress.

రాకేష్ రెడ్డి గెలుపు ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలి ….కేటీఆర్

Post top
home side top

రాకేష్ రెడ్డి గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వేటు వేయాలి… కేటీఆర్… మిర్యాలగూడ ప్రజాలహరి…. మోసాలు, ధగాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి అయిన ఏనుగు రాకేష్ రెడ్డికి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం ఎస్వి గార్డెన్స్ లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అధ్యక్షత వహించారు. మోసము, అయవంచన, కుతంత్రాల కూడిన ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని కేటీఆర్ తెలిపారు. ఎన్నికలకు ముందు మాటల గారడి మాంత్రికుడిలా ప్రజాసభల్లో అమలు కానీ అసాధ్యమైన హామీలు గుప్పిస్తూ పబ్బం గడుపుతున్న రేవంత్ రెడ్డి నేడు ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలపై నోరు మెదపడం లేదని విమర్శించారు. హామీలనే ఏ గొట్టడానికి ఆనాడు డిసెంబర్ 9న రైతు భరోసా ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు ఇచ్చాడని ఇంకా రైతులకు రైతు భరోసా రావాలని ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దు అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజా పాలనపై పట్టు లేదని ప్రతిపక్షాలపై బురద జల్లడమైన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. బస్తాకు 500 రూపాయల బోనస్ పై తమ పార్టీ మొదటి నుంచి పోరాడుతుందని మీ చెప్పినట్టుగానే ప్రజలు మోసం చేశారని ఈ విషయాన్ని రైతులు, నిరుద్యోగులు ప్రజలు గమనించాలని తెలంగాణ ప్రాంతంలో 88% దొడ్డు రకం పంట పండుతుందని ఈ సందర్భంలో రైతులపై చావు దెబ్బ కొట్టడానికి సన్న ధాన్యానికే 500 బోనస్ ఇస్తానని చెప్పటం ప్రభుత్వం హామీలే ఎగవేత విధానమని తెలిపారు . అడుగు అడుగున ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి జాతర్లలో పూనకం వచ్చిన నాయకుల్లాగా ప్రజల ముందు వాగ్దానపు మాటలు తర్వాత వాటి సాధ్యా సాధ్యులుచూసి బెంబేలెత్తి వాడిని తప్పించుకోవడానికి కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నాడని విమర్శించారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి రాకేష్ రెడ్డి ని గెలిపిస్తేనే ప్రభుత్వం కొంతమేరికైనా దిగివచ్చి ఇచ్చిన హామీలను అమలు అమలు చేస్తుందని అందుకు బిఆర్ఎస్. పోరాడుతుందని కేటీఆర్ నిరుద్యోగులను కోరారు ప్రభుత్వం పాలనా నిర్ణయాల్లో పూర్తిగా విఫలం చెందిందని మహిళలకు 2500 అడ్రస్ లేదని ,కళ్యాణ లక్ష్మి అడ్రస్ లేదని, ఉచిత విద్యుత్ అడ్రస్ లేదని ,4000 పెన్షన్ అతీగతి లేదని చెప్పారు .తమ ప్రభుత్వం బి.ఆర్.ఎస్ అధినేత కేసిఆర్ దేశం మొత్తం గర్వించదగంగా రైతుబంధు, ప్రాజెక్టులు నిర్మాణం, కల్యాణ లక్ష్మి ఒంటి పథకాలు తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేశారని చెప్పారు .గత ప్రభుత్వం ఒక లక్ష 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ఎన్నికల కోడ్ తో ఆగిపోయిన 30 వేల ఉద్యోగాలను కూడా తన ఖాతాలు వేసుకున్న రేవంత్ ని ఏమనాలని చెప్పారు .ఇప్పటికీ ఒక కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ లేదని విమర్శించారు. బిఆర్ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న మాయల మరాఠీ తీన్మార్ మల్లన్న ఓడించాలని కోరారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కాలయాపన ద్వారా ప్రభుత్వాన్ని నడిపియాలని చూస్తున్నదని వీరిని నమ్మవద్దు అని చెప్పారు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగులు పట్టబద్రులు ఆలోచించి రాకేష్ రెడ్డి ఓటేసి గెలిపించాలని కోరారు . ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ వర్గాలకు న్యాయం చేయడానికి పోరాడుతానని సమస్యల పరిష్కారానికి శాసనమండలలో కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి , మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ,మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఇంచార్జ్ ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మిర్యాలగూడ నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగార్జున చారి, ఎడవల్లి శ్రీనివాసరెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి , ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, చిట్టిబాబు నాయక్, తిరందాసు విష్ణు తదితరులు పాల్గొన్నారు…

 

మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర రావు ను వదులుకోవడం బాధాకరమైన విషయం.. నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకత్వం కలిగిన ప్రజా సమస్యలపై ,అభివృద్ధిపై పోరాడే భాస్కర్ రావుని ఎన్నికల్లో ఓడించుకోవటం దురదృష్టకరమైన విషయమని కే పేర్కొన్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని ఈ సందర్భంగా కోరారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.