
మిర్యాలగూడ ప్రజాలహరి… దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం రాజీవ్ చౌక్ నందు వారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ 1986 లో జాతీయ విద్యా విధానాన్ని దేశమంతా విస్తరించే ప్రయత్నం చేస్తూ జవహర్ నవోదయా విద్యాలయాలను స్థాపించిన గొప్ప నాయకులు వారు. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే సూపర్ కంప్యూటర్స్ రూపకల్పనకు ప్రోత్సాహం అందించిన నాయకత్వం వారిది.. వారిని స్మరించు కుంటూ వారి బాటలో ప్రతిఒక్కరం నడుస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తమ్మడ బోోయినఅర్జున్ ,గాయం ఉపేందర్ రెడ్డి ,తలకొప్పుల సైదులు, నూకలవేణుగోపాల్ రెడ్డి, చిలుకూరు బాలు, శేఖర్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు