
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు… ముఖ్యఅతిథిగా సోనియాగాంధీ రాక… ప్రజాలహరి హైదరాబాద్..
జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఈ ఉత్సవాలను రాష్ట్రంలో, నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో , జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్లో జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాదులో తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే ఉత్సవ సభకు సోనియాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరుగానున్నట్లు క్యాబినెట్ లో పేర్కొనడం జరిగింది.