
సుందరయ్య ఆశయాలను సాధించాలి
* వర్ధంతి సభలో డబ్బికార్
మిర్యాలగూడ ప్రజాలహరి
పేదల కోసం నిరంతరం పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను సాధించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ కోరారు. ఆదివారం సుందరయ్య 39 వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో సిపిఎం కార్యాలయం నుండి రాజీవ్ చౌక్ మీదుగా ఈదులగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈదులగూడెం వద్ద ఉన్న సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దనిత కుటుంబంలో పుట్టినప్పటికీ పీడిత ప్రజల కోసం నిరంతరం పోరాడారని చెప్పారు. దున్నే వాడికి భూమి ఇవ్వాలని అనేక ఉద్యమాలు జరిపారని చెప్పారు. ఆయన చేసిన పోరాటాలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని తెలిపారు ఆయన చూపిన మార్గాన్ని నేటి కార్యకర్తలు నడుచుకోవాలని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జగదీష్ చంద్ర, రవి నాయక్ డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి,భవాండ్ల పాండు, రాగిరెడ్డి మంగా రెడ్డి, పరశురాములు, శశిధర్ రెడ్డి, వరలక్ష్మి తిరుపతి రామ్మూర్తి, ఎండి అంజద్, ఆయూబ్, సీతారాములు,, వినోద్ నాయక్ సత్యనారాయణ రావు,రొంది శ్రీనివాస్, సైదులు,అరుణ, పులమ్మా తదితరులు పాల్గొన్నారు.