ఐదోసారి ఎమ్మెల్సీ ని కైవసం చేసుకుంటాం.. బడుగులు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, విజయసింహారెడ్డిలు ఉధ్గాటన.
మిర్యాలగూడ ప్రజాలహరి.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీని మరోసారి భారత రాష్ట్ర సమితి కైవసం చేసుకుంటుందని మాజీ పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, తిప్పన్న విజయ్ సింహ రెడ్డి లు పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ , విద్యార్థులు నిరుద్యోగులు తమ వైపు ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి తాము దిగిపోయే నాటికి ఒక లక్ష 63 వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు ,ఇవి కాక కేటీఆర్ నాయకత్వంలో రెండు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వివిధ కంపెనీల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని సందర్భంగా వివరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పకుండా ఉపాధి అవకాశాలు పెంపొందించిన విషయాన్ని ఎవరు మరవరాదని ముఖ్యంగా నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆనాడు తమ ప్రభుత్వాన్ని బధనం చేసి నేటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా విమర్శించారు. గత ప్రభుత్వంలో రిజల్ట్స్ లో ఉన్న 30000 ఉద్యోగాలను రేవంత్ రెడ్డి ఇచ్చి తాను ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఇది విడ్డూరంగా ఉన్నదని అన్నారు. మిర్యాలగూడ 21వ తారీఖున ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పట్టభద్రుల సమావేశంలో పాల్గొంటారని అదేవిధంగా 24వ తేదీన మార్నింగ్ వాక్ లో పలువురిని కలిసి తన గెలుపు కోసం పట్టభద్రులను ఓటు వేయాలని కోరుతారని చెప్పారు. పోలింగ్ బూతులు వారిగా సమీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, వేములపల్లి మాజీ ఎంపీపీ కర్ణాకర్ రెడ్డి, జెడ్పిటిసి మోసిన్ అలీ, మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.