Ultimate magazine theme for WordPress.

విద్యార్థులు సామాజిక స్పృహను పెంపొందించుకోవాలి మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top

విద్యతోపాటు సామాజిక స్పృహని పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి….మిర్యాలగూడ ప్రజాలహరి..

విద్యార్థులు చదువుపై శ్రద్ధతో పాటు సామాజిక అంశాలు స్పృహ కలిగి ఉండాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణా కాలనీలో గల *కేవీఆర్ ఐఐటి అకాడమీలో* పట్టణంలోనే వివిధ పాఠశాలలకు చెందిన వందమంది విద్యార్థులకు శుక్రవారం కేవీఆర్ కరస్పాండెంట్ *కాతోజు వినోద్ కుమార్* ఆధ్వర్యంలో ఐఐటి గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది విద్యార్థులు *లాస్య శ్రీ, సాత్విక్, హర్షవర్థన్, హన్మంతు, వైష్ణవి, అఖిల్, రోహన్, శారు* తదితరులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. శుక్రవారం అకాడమీలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఐఐటి గ్రాండ్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన్న విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ ఇస్తున్న కెవిఆర్ అకాడమీ యాజమాన్యాన్ని సిబ్బందిని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో కెవిఆర్ అడ్మిన్ మేనేజింగ్ డెరైక్టర్ శివ, అకాడమీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.