రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ
నల్లగొండ జిల్లా:
నాగార్జునసాగర్ , ప్రజాలహరి..
హాలీయా పట్టణం కేంద్రంలో……
బి.ఆర్.యస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన.నల్లగొండ జిల్లా శాసన మండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి మాట్లాడుతూ.
రాష్ట్ర రైతంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నేడు హాలియా పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, సన్న రకం వడ్లతోపాటు దొడ్డు రకం వడ్లకు కూడా క్వింటాలకు 500 బోనస్సు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో…….హాలియా పట్టణ అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి, తిరుమలగిరి సాగరం మండల అధ్యక్షులు పిడిగం నాగయ్య, జిల్లా మున్సిపల్ కౌన్సిలర్ సంఘం అధ్యక్షులు వర్ర వెంకట్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు బివి రమణ రాజు, నల్లగొండ సుధాకర్, సురభి రాంబాబు, మహిళా అధ్యక్షురాలు గడ్డం రమణ, సీకేయూత్ అధ్యక్షులు బండి రమేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మద్దిమడుగు మార్క్, బెజవాడ కృష్ణ, మాతాంగి కాశయ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.