
నిరుద్యోగులను మోసం చేసి, పొట్ట కొట్టిన కేసీఆర్ ను నడిరోడ్డు మీద ఉరి తీయాలి…. తీన్మార్ మల్లన్న….. మిర్యాలగూడ ప్రజాలహరి…. కెసిఆర్ గత పది సంవత్సరాల పాలనలో నిరుద్యోగులను నడి బజారుకు పాలు చేసిన కేసీఆర్ని నడిరోడ్డు మీద ఉరితీయాలని తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఎస్పి కన్వెన్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుద్యోగులను చావు దెబ్బ కొట్టిన కేసీఆర్ను క్షమించకూడదని చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయలను వేధింపులకు గురిచేసి నెలసరి వేతనాలు కూడా సక్రమంగా రాకుండా చేశారని ఇటువంటి నేత పుణ్యమా ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు. జీవో 47 ,137 జీవో వల్ల నిరుద్యోగులు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కెసిఆర్ చేపట్టిన ఏ స్కీమ్ అయిన ఏ పథకమైన అవినీతి ఉన్నదని చెప్పారు చివరకు ఆయన ప్రజల కోసం పోరాడింది ఏమీలేదని ఆయన బిడ్డ సారాస్కాంలో జైపాలు అయిందని చెప్పారు . గ్రూప్ వన్ పరీక్షలు మోడల్ స్కూల్ అవినీతి , నిరుద్యోగుల భవిష్యత్తు ఆటలాడుకోవడం వంటి పలుస్కాములు చేసిన కెసిఆర్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు లోపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. ఎమ్మెల్సీ గెలుపు అనంతరం మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన డి ఏ లు ఫిట్మెంట్ పిఆర్సి వంటి సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకోవాలని ఆయన గెలుపు కోసం 100% పని చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ నాయకులు చంద్రారెడ్డి , కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, అర్జున్, తలకొప్పల సైదులు ,గాయం ఉపేందర్ రెడ్డి రావు ఎల్లారెడ్డి బెజ్జం సాయి, శ్రీనివాస్ , మహబూబ్ అలీ, సిద్ధ నాయక్ తదితరులు పాల్గొన్నారు.