దేవాలయాలు, దేవుళ్ళపై ప్రమాణాలు తప్ప వాగ్దానాలు అమలులో ముఖ్యమంత్రికి నిబద్ధత లేదు బి.ఆర్ ఎస్. నాయకుల విమర్శలు

దేవాలయాలు ,దేవుళ్ళ మీద ప్రమాణాలు -వాగ్దానాలు ఊసు లేదు.. బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్… ప్రజాలహరి మిర్యాలగూడ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయాలు దేవుళ్ళ మీద ప్రమాణాలు తప్ప ఇచ్చిన వాగ్దాన అమలు చేయడం లేదని భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి మరియు బిఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో విమర్శించారు. డిసెంబర్ 9న నూతనంగా రైతు భరోసా అమలు చేస్తా అన్నాడు ఇంతవరకు అమలు చేయలేదని గత ప్రభుత్వం విడుదల చేసిన రైతు రైతుబంధువుని అమలు చేసి కొత్తగా ఇస్తా అన్న రైతు భరోసాన్ని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.. ఎన్నికల అనంతరం బస్తాకు 500 బోనస్ కాగితపు మీద నీటి రాతలు పేర్కొన్నారు. ఇప్పుడు మాట మార్చి సన్నం బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తానని కొత్తగా దొంగ మాటలు చెబుతున్నారని ఇటువంటి నేతల్ని మనం ఎన్నుకోవడం దురదృష్టకరమని తెలిపారు. పూటకు ఒక పర్యటన, పూ టకు ఒక వాగ్దానము, పూటకు ఒక వాయిదా ఇది రేవంత్ రెడ్డి పరిపాలన ఇటువంటి ముఖ్యమంత్రి కారణంగా ప్రజలకు నాయకులకు పైవిశ్వాసం విశ్వాసం పోతుందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇంతవరకు ఆమాలు నోచుకోలేదని, మహిళలకు 2500 అడ్రస్ లేదని, రైతు భరోసా 15000 అడ్రస్ లేదని, రైతు బీమా గతంలో మంజూరైన వాటికి దిక్కు లేదని ఘాటుగా విమర్శించారు ముఖ్యమంత్రికి, క్యాబినెట్ మంత్రులకు సమన్వయం లేదని తలా ఒక మాట చెప్తారని ఈ సందర్భంగా తెలిపారు. కెసిఆర్ పోరాటం వల్లనే ఆ రైతుబంధు కూడా పడ్డదని లేకపోతే అది కూడా ఇంతే సంగతులు చిత్తగించవలెను అనే పరిస్థితి ఉండేదని చెప్పారు. భారత జాతిపిత స్వర్గీయ మహాత్మా గాంధీ విగ్రహాo వరకు ర్యాలీగా వెళ్లి మహాత్మాగాంధీకి ఒక వినతి పత్రం అందించారు. ఈ విలేకరుల సమావేశంలో డి సి ఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి ,జెడ్పిటిసి మోసిన్ అలీ, దామరచర్ల జడ్పిటిసి హతిరాం నాయక్ ,మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు, ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి, నాయక్ మైనార్టీ నాయకులు కరీం, మాజీ ఎంపీపీ కర్ణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవి నాయక్, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.