Ultimate magazine theme for WordPress.

రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది… జానారెడ్డి

Post top

రాష్ట్రస్థాయిలోనే భారీ మెజార్టీతో నల్గొండ పార్లమెంటు సీటు కైవసం ..

మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి… *నల్గొండ జిల్లా నేతల వల్లనే తెలంగాణ సాధ్యం….*నాయకులు సంస్కారవంతమైన భాషను అలవర్చుకోవాలి..

 

 

మిర్యాలగూడ ప్రజాలహరి.. రాష్ట్రస్థాయిలోనే భారీ మెజార్టీతో నల్గొండ పార్లమెంటు సీట్లు కైవసం చేసుకుంటున్నామని మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి స్వగృహల్లో విలేకరులతో మాట్లాడారు. నల్గొండ పార్లమెంటును మూడు నుంచి ఐదు లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలుచుకుంటున్నామని చెప్పారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నెల రోజులు కష్టపడి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు పేర్కొన్నారు. ఇండియా కూటమి పార్టీలన్నీ పూర్తిగా సహకరించయని వారి పాత్ర గూర్చి చెప్పారు.. దేశస్థాయిలో ఇండియాకుటమి భారీ మెజార్టీలతో భారీ సంఖ్యలో సీట్లు సాధిస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక పార్లమెంటు స్థానాలు సాధిస్తామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని సేవలు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు .ఆ విశ్వాసమే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని వివరించారు………

 

ఆత్మ విమర్శ చేసుకోకపోతే ఢమాలే…

రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమను ఎందుకు పక్కా పెట్టాయని విషయాన్ని పై ఆత్మ విమర్శలు చేసుకోకపోతే వాళ్ల రాజకీయ భవిష్యత్తు ఢమాలు అని జానారెడ్డి చెప్పారు .కేటీఆర్ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై చురకలాంటిస్తున్న నేపథ్యంలో పై సమాధానాన్ని పేర్కొన్నారు. ప్రజల అభిమతాన్ని ఎప్పుడూ గౌరవించాలని ఆ విధంగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజకీయాలోఆటుపోటులు సహజమని ఆ సందర్భంలో జరిగిన కష్టనష్టాలు, లాభనష్టాలు బెర్రీజు వేసుకుంటూ పార్టీలు ముందుకు వెళ్లాలని ఆయన వివరించారు. అలా కాదంటే అధికారం ఉన్నప్పుడే అందరూ ఉంటారని అధికారం లేనప్పుడు ఎవరు మన వెంట ఉండరు అనే విషయాన్ని ధమాల్ అనే వ్యక్తులు గుర్తించాలని అన్నారు.

…కెసిఆర్ ఆరోపణలను ప్రజలు స్వీకరించలేదు… కెసిఆర్ పంట నష్టం ఇతర పలు ప్రభుత్వ పథకాలపై అనవసరమైన రాద్ధాంతం చేశారని ఆయన చేసిన రాద్ధాంతాన్ని ప్రజలు గుర్తించలేదని ఈ సందర్భంగా జ్ఞానారెడ్డి విమర్శించారు. రైతులు కాంగ్రెస్ మీద కోపం ఉన్న ఎన్నికల సమయంలో సమసి పోయిందని వివరించారు.

నాకు పదవులు అవసరం లేదు.. తాను ఏనాడు పదవులను కోరుకోలేదని మాజీ సీఎల్పీ నేత జనారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు అధిష్టానాన్ని గాని, పార్టీ నాయకత్వాన్ని గాని ఫలానా పదవులు కావాలి అని కోరిన దాఖలా లేదని రాజకీయాల్లో స్వయం ప్రకాశం ఉండాలని అందుకు ఉదాహరణ తానే అని చెప్పుకొచ్చారు. ప్రజల అభిమానoబట్టి పార్టీలే మనకు పదవులు కట్టబెడతాయని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను కోరుకుంటే మంత్రులు, మొదలు గవర్నర్, పార్లమెంటరీ, రాజ్యసభ పదవులు వచ్చేవి అని ఏనాడు పదవులను ఆశించటం గాని పైరవీలు చేయటం గాని తనకు తెలియదని వివరించారు. ……ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు సంస్కారాన్ని అలవర్చుకోవాలి జానారెడ్డి….

 

 

నాయకులూ అనేవారు మంచి సంస్కారవంతమైన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు .రాజకీయాలు మాట్లాడే సమయంలో స్పష్టమైన అందరూ మెచ్చుకొని విధంగా మాట్లాడాలని చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రి గాఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రజలు, శాసనసభ్యులను ఉద్దేశించి ప్రజలు మెచ్చుకునే విధంగా మాట్లాడుకోవాలనీ, ప్రజా శ్రేయస్సు కోసం పనికి వచ్చే ప్రశ్నలు గానీ లేవనత్తాలే తప్ప ఆ సందర్భంగా వ్యాఖ్యలు, దూషణలతో కూడిన మాటలు ప్రజలు మెచ్చర్ని శాసనసభ సాక్షిగా చెప్పినట్లు వివరించారు.

…తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లో నల్లగొండ జిల్లా కీలక పాత్ర… తెలంగాణ రాష్ట్ర సాధనలో నల్గొండ జిల్లా నేతలు కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా జానారెడ్డి చెప్పారు .సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణను ప్రకటించి నిజాం గ్రౌండ్ సభలో ప్రకటించామని ఈ సందర్భంగా చెప్పారు .ఆనాటి పోరాట యోధులు అందరికీ విషయం తెలుసునని అందులో ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ తన దగ్గరికి వచ్చి తెలంగాణ సాధనకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా సహకరించాలని కోరారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు కవులు మేధావులు అన్ని రాజకీయ పార్టీలు సహకారం సహకారం పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని ఇది ఏ ఒక్కరి క్రెడిట్ కాదని చెప్పారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ,డిసిసి అధ్యక్షుడు శంకర నాయక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, తలకొప్పుల సైదులు, గాయం ఉపేందర్ రెడ్డి, రామలింగ యాదవ్ ,కందుల నరసింహారెడ్డి, మహమ్మద్ గౌస్ ,కోట శ్రీనివాసరావు, ఆవుల బక్క రెడ్డి ,బసవయ్య, వంగాల నిరంజన్ రెడ్డి తత్తరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.