19 న జరిగే సుందరయ్య వర్ధంతి సభను జయప్రదం చేయాలి
* సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్
మిర్యాలగూడ ప్రజాలహరి
ఈనెల 19న మిర్యాలగూడలో జరిగిన సుందరయ్య వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో సుందరయ్య వర్ధంతి సభను నిర్వహించాలని కోరారు. నియోజవర్గ కేంద్రమైన మిర్యాలగూడలోని సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శిలు, పార్టీ సభ్యులు, ప్రజాసంఘాల బాధ్యులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం కోరారు. సుందరయ్య చేసిన త్యాగాలను ఈ సభలో వివరించి కార్యకర్తల్లో రాజకీయ చైతన్యం తీసుకురానున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సమస్య ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోరారు. నిత్యం ప్రజలతో మమేకమై పార్టీ విధానాలను వారిలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతం కు పాటుపడాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ప్రజా ప్రతినిధులు గెలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీష్ చంద్ర, రవి నాయక్, డా.మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, శశిధర్ రెడ్డి, వినోద్ నాయక్, ఆయూబ్, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, ఎండి అంజాద్, రొండి శ్రీనివాస్, జాతంగి సైదులు, పాపిరెడ్డి, పాల్వాయి రాంరెడ్డి, జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.