… వంద సంవత్సరాలు తర్వాత అయినా మిర్యాలగూడ రాజకీయ అభివృద్ధి పటంలో భాస్కరరావు ప్రముఖంగా కనిపిస్తారు నల్లమోతు సిద్ధార్థ

*. మిర్యాలగూడ అభివృద్ధి లో భాస్కర్ రావు ది ప్రత్యేక పాత్ర…
*రాజకీయాల్లో ఉద్యమ స్ఫూర్తి కల్పించింది భారత రాష్ట్ర సమితి..
పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ కార్యకర్తల సేవలు ప్రశంసనీయం …నల్లమోతు సిద్ధార్థ
.మిర్యాలగూడ ప్రజాలహరి.. మా తండ్రిగారు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ద్వారా రాజకీయ అక్షరాభ్యాసం, కార్యకర్తలతో మమేకమే విధానము ఈరోజు కృష్ణారెడ్డి గెలుపుకు దోహదపడుతున్నాయని భారత రాష్ట్ర సమితి యువ నేత నల్లమోతు సిద్ధార్థ అన్నారు. తన తండ్రి గారు ఎమ్మెల్యేగా చేసిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో సుమారు ఆరున్నర వేల కోట్ల రూపాయలతో మిర్యాలగూడ నియోజకవర్గం ను అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమైన వాస్తవికతతో మాట్లాడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు . యాదాద్రి పవర్ ప్లాంట్ మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధికి ఐఎస్ఐ బ్రాండ్ అంతేకాక రాష్ట్రానికి కూడా బ్రాండ్ అని ఈ విషయాన్ని స్థానిక నేతలు జిల్లా నేతలు ఎవరు విస్మరించరాదని పేర్కొన్నారు. మూడు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసిన ఘనత కూడా తమదేనని చెప్పారు
మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ అభివర్ణించారు. తమ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత నల్లమోతు భాస్కర్ రావుకే దక్కుతుందన్నారు. నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన బీఆర్ఎస్ క్యాడర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ లో తెలంగాణ గళాన్ని వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిథ్యం తప్పనిసరి అని అన్నారు. కంచర్ల కృష్ణా రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ప్రచారం ముగిసే తేదీ నాటికి బీఆర్ఎస్ శ్రేణులు మిర్యాలగూడ నియోజకవర్గంలోని గడపగడపకు వెళ్లి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాయని అన్నారు. నమూనా బ్యాలెట్ పేపర్ ను కార్యకర్తలు ప్రదర్శించి అవగాహన కల్పించారని నల్లమోతు సిద్దార్థ తెలిపారు. బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ నింపేందుకు గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టిన పోరుబాట కార్యక్రమం, రోడ్డు షో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచే ప్రారంభం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. మిర్యాలగూడ లో కేసీఆర్ చేపట్టిన రోడ్డు షో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నింపిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన భారత రాష్ట్ర సమితి శ్రేణులు అందరికీ, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా.. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. సవాళ్లు ఎదుర్కొని తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం’ అన్న నానుడిని నిజం చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాసీ వ్యవహారం కాదని.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన నిబద్ధతతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెంట నడిచి, ఎన్నికల్లో ప్రజామోదం కోసం కొట్లాడిన తీరు అద్భుతమన్నారు. గత రెండు మూడు నెలలుగా సామాజిక మాధ్యమాల్లో పార్టీ కోసం పని చేసిన, ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్స్‌కి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ మీద ఉన్న ప్రేమ, కేసీఆర్‌పై ఉన్న అచంచలమైన విశ్వాసంతో పార్టీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో తమ వాణిని బలంగా వినిపించి, అద్భుతంగా కొట్లాడారన్నారు. తమ పార్టీ శ్రేణులు చేసిన ఈ పోరాటం గొప్ప ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు నల్లమోతు సిద్దార్థ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసిన ఓటరు మహాశయులకు, దాదాపు రెండు నెలలకు పైగా ప్రచార కార్యక్రమాల్లో అహర్నిశలు పాల్గొన్న నేతలకు, కార్యకర్తలకు నల్లమోతు సిద్దార్థ ధన్యవాదములు తెలిపారు.