ఎంపీ రఘువీర్ గెలుపు కోసం
సైనికుల పని చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు
వేములపల్లి (ప్రజాలహరి) నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కోసం వేములపల్లి మండలం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లో పనిచేస్తూ తమ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. సోమవారం వేములపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలి కాంత రెడ్డి మాట్లాడుతూ, నేను జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట పిసిసి నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రావు ఎల్లారెడ్డి, వేములపల్లి మాజీ సర్పంచులు నాగవెల్లి మధు, రేగటి రవీందర్ రెడ్డి, సెలబట్ల శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు పుట్టల శ్రీనివాస్, సత్తిరెడ్డి, సిపిఎం నాయకులు పాదూరి శశిధర్ రెడ్డి, సిలబట్ట ప్రణీత్ రెడ్డి, వార్డు మెంబర్ పుట్టల సైదులు, జానకి రాములు తదితరులు పాల్గొన్నారు