కంచర్ల గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణుల సమిష్టి కృషి అనిర్వచనీయం : భాస్కర్ రావు
మిర్యాలగూడ ప్రజాలహరి..
నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి గెలుపు కోసం మిర్యాలగూడ బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన కృషి అనిర్వచనీయమని మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. కంచర్ల కృష్ణా రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ప్రచారం ముగిసే తేదీ నాటికి బీఆర్ఎస్ శ్రేణులు మిర్యాలగూడ నియోజకవర్గంలోని గడపగడపకు వెళ్లి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాయని అన్నారు. నమూనా బ్యాలెట్ పేపర్ ను కార్యకర్తలు ప్రదర్శించి అవగాహన కల్పించారని భాస్కర్ రావు తెలిపారు. బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ నింపేందుకు గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టిన పోరుబాట కార్యక్రమం, రోడ్డు షో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచే ప్రారంభం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. మిర్యాలగూడ లో కేసీఆర్ చేపట్టిన రోడ్డు షో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నింపిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు. మిర్యాలగూడ లో బీఆర్ఎస్ క్యాడర్ స్ట్రాంగ్ గా ఉన్నదని భాస్కర్ రావు అన్నారు.ప్రతీ కార్యకర్తకు గులాబీ జెండా కొండంత అండగా నిలుస్తున్నదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసిన ఓటరు మహాశయులకు, దాదాపు రెండు నెలలకు పైగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలకు, కార్యకర్తలకు భాస్కర్ రావు ధన్యవాదములు తెలిపారు