ఆధ్యాత్మిక నవ వైతాళికులు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులు, రామానుజను జీయర్లు..
మిర్యాలగూడ ప్రజాలహరి..
మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ కళ్యాణ మండపం నందు ఆదివారం శ్రీ జగద్గురులు ఆదిశంకరాచార్యులు, రామానుజుల జియర్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమాన్ని మిర్యాలగూడ నియోజకవర్గం బ్రాహ్మణ వెల్ఫేర్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు ఉదయం 9:30 మొదలు మధ్యాహ్నం మూడు గంటల 50 నిమిషాల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా శ్రీగణపతి పూజ, నమకము ,చమకము రుద్ర ప్రశ్న అనువాహిక ఏకాదశ మహన్యాస పూర్వక శ్రీ సూక్తం పురుష సూక్త నారాయణ సూక్త లతో శ్రీ పరమేశ్వరుడికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది ముందుగా ఆదిశంకరాచార్యులు మరియు శ్రీ రామానుజ జియర్ గార్ల ఉత్సవ ప్రతిమలను ఊరేగింపుగా మండపావస్థతలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు అనంతరం పదో తరగతి, ఇంటర్మీడియట్ ,వేద అభ్యాసనలో మంచి ర్యాంకులు పొందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు బోయినపల్లి వెంకటరమణారావు, కురుమేటి రాధాకృష్ణ, చిట్యాల శ్రీనివాస, చిట్యాల వెంకటరమణ ,చిట్యాల శ్రీనివాసరావు, కొప్పోలు వెంకటేశ్వరరావు, మామిడాల రామ్మోహన్ రావు ,పులి కృష్ణమూర్తి, కిరణ్ శర్మ, పూర్ణయ్యశర్మ, శంబయ శర్మ నాగేందర్ ,నవీన్, జిల్లా నాయకులు రాయపూడి మురళి, ఆదిత్య శర్మ, శ్రీకాంత్ శర్మ ,తదితరులు పాల్గొన్నారు