*కారు గుర్తుకు ఓటు వేసి కంచర్ల కృష్ణారెడ్డి గారిని గెలిపించండి – సిద్దార్ధ*
మిర్యాలగూడ ప్రజాలహరి… రైతాంగానికి అనేక సేవలందించిన బి ఆర్ఎస్ రాష్ట్ర సమితి అభ్యర్థి అయినా కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని మిర్యాలగూడ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి యువ నేత నల్లమోతు సిద్ధార్థ పిలుపునిచ్చారు
*పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కొరకు ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డ్ లల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు, ప్రచారంలో వార్డ్ కోఆర్డినేటర్లు అన్నభీమోజు నాగార్జున చారి, యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, పశ్య శ్రీనివాస్ రెడ్డి గార్లతో కలిసి యువనేత సిద్దార్ధ పాల్గొని కారు గుర్తు పై ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారిని అత్యదిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు*..
*ప్రచారంలో వార్డ్ కౌన్సిలర్లు, ఆయా వార్డుల ఇంచార్జ్ లు, బీఆర్ఎస్ నాయకులు, వార్డ్ అద్యక్ష కార్యదర్శులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*