*మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: కాంగ్రెస్ నాయకులు, హైకోర్టు న్యాయవాది నూనె ప్రభాకర్*
prajala Hari…
కంటోన్మెంట్: కాంగ్రెస్ పార్టీ న్యాయమైన ఐదు వాగ్ధానాలు అమలు చేసి, ప్రతి భారతీయుడికి మంచి భవిష్యత్తును అందించడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణన్ శ్రీ గణేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు, హైకోర్టు న్యాయవాది నూనె ప్రభాకర్ ప్రజలను కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, హైకోర్టు న్యాయవాది నూనె ప్రభాకర్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ 6 వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. వార్డులో ప్రజలను, ఓటర్లను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. ఈసందర్భంగా నూనె ప్రభాకర్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టిందని, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన పాంచ్ న్యాయ్ పథకాలు అధికారంలోకి రాగానే అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ 1) మహిళలకు ప్రాధాన్యత, 2)యువతకు ఉపాధి, 3)రైతులకు వెన్నుదన్ను, 4) శ్రామికులకు భరోసా, 5) అన్నిటికీ సమన్యాయం అమలు చేయడం జరుగుతుందన్నారు. పాంచ్ న్యాయ్ లో భాగంగా గృహలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాల్లోకి నగదు జమ, రూ. 450 కు వంటగ్యాస్ సిలిండర్, బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ, రైతులకు కనీస మద్ధతు ధరపై హామీ, వ్యవసాయ పరికరాల ధరలపై జీఎస్టీ మినహాయింపు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, కుల గణన ఆధారంగా రిజర్వేషన్ల కల్పన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు, న్యాయ్ యోజన పథకం కింద పేద కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ. 72 వేల ఆర్థిక సహాయం, రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు రైలు ప్రయాణ టికెట్లపై రాయితీ, రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత, చిన్నతరహా పరిశ్రమల రుణాలను మాఫీ చేసి.. తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ చేయడం, పేద మహిళలకు ఏడాదికి రూ. లక్ష నగదు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన, కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆడుకోవడం, పంటలకు కనీస మద్దతు ధర చట్టం, ఆదుకునేందుకు రుణ సాయం అందించడం జరుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణన్ శ్రీ గణేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు రామ్ కళ్యాణ్ చల్లా, రమాకాంత్, సయ్యద్ లుక్మాన్ అలీ, సిక్కం సత్యనారాయణ, కట్టా కోటిరెడ్డి, వి. పరమేష్ గౌడ్, ఏ. కృష్ణ, డి. పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.