మిర్యాలగూడ ప్రజాలహరి.
అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి* ఆధ్వర్యంలో నిర్వహించిన *రోడ్డు షోలో* పాల్గొన్న నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నల్గొండ డిసిసి అధ్యక్షుడు, కేతావత్ శంకర్ నాయక్ గారు*.. ఈ కార్యక్రమానికి వేలాదిగ కదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , అభిమానులు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కిల్లా అనే పేరుని మరోసారి మీరు ఇచ్చే అత్యధిక మెజారిటీతో రుజువు చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని అన్నారు.. ఎంతటి ఎండలో కూడా వేలాదిగ కదలి వచ్చి మాకు ఘనస్వాగతం పలికినందుకు ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా, అత్యధిక ఓటింగ్ పోల్ అయ్యేలా అందరూ కలసి కట్టుగా పనిచేయాలని అన్నారు. అలాగే ఇండియా కూటమిలో భాగంగా మాకు మద్దతు తెలపడానికి కదిలి వచ్చిన CPI(M) కమ్యూనిస్టు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.