Ultimate magazine theme for WordPress.

కాంగ్రెస్ నుంచి 200 మంది బిఆర్ఎస్ లో చేరిక

Post top
home side top

*పట్టణంలోని తాళ్లగడ్డ వార్డ్ 2 నుంచి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరికలు*

 

*కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించిన మాజీ ఎమ్మెల్యేలు*

 

*మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డ (వార్డ్ 2) మాజీ కౌన్సిలర్, ఉద్యమకారులు గుడిసె దుర్గాప్రసాద్ గారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పార్టీకు రాజీనామా చేసి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి గార్ల సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు, వారిని మాజీ ఎమ్మెల్యే గారు కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించారు*..

 

*ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు మాట్లాడుతూ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో, బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రజలందరికీ న్యాయం జరిగింది అని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అమలు కానీ హామీలను చూసి ప్రజలు మోసపోయారు అని, రానున్న పార్లమెంటు ఎన్నుకల్లో బిఆర్ఎస్ పార్టీ కు అత్యదిక సీట్లు ఇచ్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు అని తెలిపారు.. అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే 15 కోట్ల రూపాయలతో తాళ్లగడ్డ నందు 100 ఫీట్ల రోడ్డు మంజూరు చేయించాం అని, అలాగే 2 కోట్ల రూపాయలతో ధోబి ఘాట్, 5 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో వైకుంఠ ధామాన్ని నిర్మించుకున్నామని తెలిపారు, కొంత మంది పదవులు అనుభవించి పార్టీలు ఫిరాయించారు అని బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అదైర్య పడొద్దు అని మళ్ళీ నూతన క్యాడర్ ను నిర్మించుకొని పార్టీ ను బలోపేతం చేసుకుందామని తెలిపారు, గతంలోను దుర్గాప్రసాద్ కు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం అని, రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దుర్గాప్రసాద్ కు టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించుకుందామని తెలిపారు*.

 

*తిప్పన విజయసింహ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ బోగస్ హామీలను ప్రజలు నమ్మి గోస పోయారు అని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు బుద్ది చెప్పే బాద్యత ప్రతి ఒక్కరికీ ఉంది అని తెలిపారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కెసిఆర్ గారితోనే సాద్యమని తెలిపారు, అలాగే మిర్యాలగూడ నియోజకవర్గo భాస్కర్ రావు గారి హయాంలోనే అబివృద్ది చెందింది అని గుర్తు చేశారు, 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కంచర్ల కృష్ణారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని తెలిపారు*

 

*దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ తిరిగి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ది ప్రధాత భాస్కర్ రావు గారు మరియు తిప్పన విజయసింహ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతునాన్ని, రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు*.

 

*పార్టీలో చేరిన వారిలో (శ్యామలమ్మ, నాగమ్మ, కోలా ఎల్లమ్మ, గుడిసె అశోక్, రాంరెడ్డి, నారన్న, కురివి వెంకన్న, రాంబాబు, సైదులు, రాపోలు శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, ఇమ్రాన్, ఇర్ఫాన్, నాగేందర్ ) తదితరులు ఉన్నారు*…

 

*ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అన్నాభీమోజు నాగార్జున చారీ, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, యువనేత సిద్దార్ధ, కౌన్సిలర్లు ఇలియాస్ ఖాన్, శ్యామ్ సుందర్ రెడ్డి, కమ్లి భిమ్లా నాయక్, బల్లెం అయోధ్య, వజ్రం, మాజీ కౌన్సిలర్లు మాజీద్, కరీం, రఘుయా రెడ్డి, షోయబ్, ఎర్ర శ్రీను, DVP సుబ్బారావ్, పునాటి లక్ష్మీ నారాయణ, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, నేరెళ్ళ శివ, నాగుల్, చోటు తదితరులు పాల్గొన్నారు*..।

post bottom

Leave A Reply

Your email address will not be published.