
రాజ్యాంగ రక్షణ కోసం సైనికుల్లా పోరాడాలి :-
పరకాల ప్రభాకర్, రాజకీయ విశ్లేషకులు.
మిర్యాలగూడ :
రాజ్యాంగ పీటికలో ఉన్న అంశాలు ఏ ఒక్కటి కూడా ప్రస్తుతం అమలు కావడం లేదని
ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడు కోవడం కోసం దేశ ప్రజలు గొంతెత్తి నినదించ వలసిన అవసరం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. గురువారం స్థానిక మిర్యాలగూడ లోని ఐఎంఏ హాల్ రామచంద్ర గూడలో జన విజ్ఞాన వేదిక నాయకులు డా. మువ్వా రామారావు అధ్యక్షతన పదేళ్ల కేంద్ర పాలనలో ప్రజా జీవితం దేశ భవిష్యత్తు అనే అంశం పైన టీపీ జే ఏ సి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తలుగా రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్,రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి పరిపాలించవలసిన పాలకులు ప్రజాస్వామ్యానికి అతీతంగా పాలిస్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలని కోరారు. డాక్టర్ మువ్వా రామారావు మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగమే ఐకాన్ అని ప్రతి ఒక్కరు రాజ్యాంగ సూత్రాల కట్టుబడి ఉండాలని అన్నారు. మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి,టిపి జాక్ నాయకులు రవీందర్ లు మాట్లాడుతూ దేశంలో పేదరికం నిరుద్యోగం ఆదాయ సమానతల రూపొందించవలసిన పాలకులు ఆదాయ అసమానతలు పెంచే కార్యక్రమాలను చేయటము సరైనది కాదు అన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ రాజు, బీసం రామయ్య, వేనేపల్లి పాండురంగారావు, జ్వాల వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు డబ్బికార్ మల్లేష్, రావినాయక్, జనవిజ్ఞా వేదిక నాయకులు కొండల్ రెడ్డి సుదర్శన్, మౌసమ్ హుస్సేన్, బ్రహ్మానంద రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నా రజ్యాంగాన్నిరు