
మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ పార్టీ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినట్లు ప్రకటించిన తిరునగర్ భార్గవ్…. ఆయనబాటలోనే మరో పదకొండు మంది కౌన్సిలర్లు పిఎసిఎస్ డైరెక్టర్లు…. మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవికి, మరియు కౌన్సిలర్ పదవికి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పదవులకు రాజీనామా చేసి రాజీనామా పత్రాలను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి అందజేసి తనతో పాటుగా 11 మంది కౌన్సిలర్లు కూడా చేరినట్లుగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ప్రకటించారు. ఆయన గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి కొండూరు రవి రెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ పార్టీ ఇంచార్జ్ మున్షిదాస్ ఆధ్వర్యంలో హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు స్థానికంగా ఎమ్మెల్యేతో సమన్వయం కోసం ఈరోజు వారికి కౌన్సిలర్ పదవులు చైర్మన్ పదవులు టిఆర్ఎస్ పార్టీ పదవులకు రాజీనామా చేసిన పత్రాలను ఎమ్మెల్యేకు అందజేసి కాంగ్రెస్లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు పార్టీ నిర్ణయం ఏది తీసుకుంటే ఆ నిర్ణయాలు కట్టుబడి పని చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు.