విద్యుదా ఘాతానికి గురై రెండు పాడి గేదెలు మృతి
వేములపల్లి మే6.. ప్రజాలహరి ): విద్యుదాఘాతానికి గురై రెండు పాడి గేదెలు మృతి చెందిన సంఘటనసోమవారం మండలంలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చింతరెడ్డి సైది రెడ్డి, లేకి రెడ్డి మంగమ్మల పాడి గేదెలు ఇంటి నుంచి రోజువారీగా మేతకు గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్ళాయి. రెండు పాడి గేదెలు మేత వేసుకుంటూ వెళుతున్న క్రమంలో పొలం గట్టు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి సపోర్టుగా ఉన్న తీగను తాకడంతో విద్యుదా ఘాతానికి గురై రెండు పాడి గేదలు అక్కడికక్కడే మృతి మృతి చెందాయి. మృతి చెందిన పాడి గేదెలు ఒక్కొక్కటి సుమారు40 వేల రూపాయల వరకు ఉంటాయని పాడిపై ఆధారపడి జీవిస్తున్న తమకు ప్రభుత్వము ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.