మిర్యాలగూడ ప్రజాలహరి..
.మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ (వార్డు-5) బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఈరోజు శాసనమండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేశారు*.
*ఇట్టి సమావేశానికి వార్డ్ కొ ఆర్డినేటర్ పశ్య శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు అన్నాభీమోజు నాగార్జున చారీ, యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి గార్లతో కలిసి నియోజకవర్గ యువనేత నల్లమోతు సిద్ధార్థ పాల్గొన్నారు*..
*సమావేశం అనంతరం లోక్ సభ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని శాసనమండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి ఆవిష్కరించారు, అనంతరం కోటిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు గడప గడపకు ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ హయంలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేయించి కంచర్ల కృష్ణారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉందని తెలిపారు*..
*ఈ సమావేశంలో వార్డు అధ్యక్షులు పల్నాటి జానకి రెడ్డి, రెడబోతు సంతోష్ రెడ్డి, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఘంట శ్రవణ్ రెడ్డి, రవి నాయక్, జన్నపాల కిరణ్, కత్రోజు దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు*..