మిర్యాలగూడ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తా.. కుందూరు రఘువీర్ రెడ్డి…. మిర్యాలగూడ ప్రజాలహరి. మిర్యాలగూడ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి తో కలిసి మిల్లర్స్ అసోసియేషన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడను ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి వ్యాపారస్తులు ,ప్రముఖులు అందరు సహకరించాలని కోరారు .మన సర్వీస్ మొత్తంలో ఒక గోల్తో పనిచేయాలని ఒక ప్రత్యేక నూతన ఒరవడి సృష్టించాలని చెప్పారు .ఫలానా వారి పాలనలో పలానా వారి ఎంపీ అభ్యర్థి కాలంలో ఈ అభివృద్ధి చేశారు వారి వలన సాధ్యమైందని ప్రజలు మనల్ని కొనియాడాలని అన్నారు. అందుకు ఒక్కో సందర్భంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వ్యాపారస్తులు అందుకు సహకరించాలని కోరారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ అభివృద్ధికి ఒక ప్రత్యేక విజన్ తయారు చేస్తున్నట్లు ఆ విజన్ పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రముఖులతో చర్చించి ముందుకు వెళ్తామని చెప్పారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్ మాట్లాడుతూ మిర్యాలగూడ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశ్రమల ప్రోత్సాహం కింద ఏర్పాటుచేసిన పలు పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు రావాలని ఆ రాయితీలు విడుదలకు స్థానిక ఎమ్మెల్యే మరియు పార్లమెంట్ అభ్యర్థి లు సహకరించాలని కోరారు . డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సమస్యలు, రైతుల సమస్య పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని చెప్పారు.ఈ కార్యక్రమంలో మిల్లర్స్ నాయకులు మంచుకొండ వెంకటేశ్వర్లు, బండారు కుశలయ్య, గార్లపాటి ధన మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.