నీతి నిజాయితీకి మరో పేరు మోదీ
ప్రజాలహరి, వేములపల్లి :
నీతి నిజాయితీకి మరో పేరు ప్రధాన మోడీ అని బిజెపి పార్టీ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాల మాటలను ఒకసారి ఓటేసిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటు వేసి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కుటుంబ పాలనకు వేసినట్లు లేనని, మోడీకి ఓటు వేస్తే దేశ అభివృద్ధికి వేసినట్లు అవుతుందని అన్నారు. భారత దేశ ఆత్మగౌరవాన్ని భారతీయ జనతా పార్టీ కాపాడుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్న మోడీకి మరొకసారి ఓటు వేసి ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి అన్నారు. మోడీ ప్రధాని కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాదినేని శ్రీనివాసరావు, చిర్ర సాంబమూర్తి, జవాజి సత్యనారాయణ, పందిరి భాగ్యమ్మ, చల్లా సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ :
వేములపల్లి మండల కేంద్రంలో మాట్లాడుతున్న సైదిరెడ్డి.