మిర్యాలగూడ ప్రజాలహరి…ఈరోజు నల్గొండ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కుందూరు రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ 17వ వార్డు నందు వార్డు కౌన్సిలర్ లావూరు రవి నాయక్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడకాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి కొర్ర నాగు నాయక్ ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారిని ఏ విధంగానైతే అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాము రఘువీర్ రెడ్డి ని కూడా మిర్యాలగూడ నియోజకవర్గం నందు లక్ష మెజార్టీ తీసుకురావాలని నాయకులు ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వారు అయితే అన్ని సమస్యలు పరిష్కారమైతవని మన నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేపట్టవచ్చని కావున ప్రతి ఒక్కరూ సహకరించి రఘువీర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని ప్రజలను కోరినారు.ఈ కార్యక్రమంలో నాయకులు, గడగోజు అశోక్ బీసీ సంఘం టౌన్ యూత్ ప్రెసిడెంట్, కేతావత్ జవహర్ నాయక్, గుడిపాటి కృష్ణ, దేవులపల్లి వంశీ చారి, లచ్చి రెడ్డి గారు, భీమేష్, నరేందర్ మరియు కార్యకర్తలు, బి ఎల్ ఆర్ బ్రదర్స్ అభిమానులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.